హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం: ఎమ్మెల్యే

RR: షాద్‌నగర్ ఆర్టీసీ బస్ స్టేషన్‌లో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చిన్నారులకు చుక్కలు వేసి ప్రారంభించారు. పోలియో రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యత అని, ఐదేళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బసవేశ్వర్, వైద్య అధికారులు పాల్గొన్నారు.