హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ శిక్షణకు వినోద్‌ ఎంపిక

JGL: భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో అత్యున్నతమైన అసిస్టెంట్‌ లీడర్‌ ట్రైనర్‌ శిక్షణకు జగిత్యాల జిల్లా నుంచి వినోద్‌గౌడ్‌ ఎంపికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిక్షణకు ఎంపికైన అతికొద్ది మందిలో జిల్లా వాసికి చోటు దక్కడం విశేషం. వినోద్‌ను భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా కార్యదర్శి కొలగాని మధుసూదన్, కమిషనర్‌ హరిచరణ్‌రావు, జమునరాణి అభినందించారు.