SRD: న్యాల్కల్ మండలం గణేష్‌పూర్ గ్రామంలో అక్రమ తవ్వకాలు తరచూ జరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయన్న ఫిర్యాదులపై జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ ఆకస్మిక తనిఖీలు చేశారు. రూరల్ సీఐ నర్సింలు, హద్నూర్ ఎస్సై సుజిత్ బృందం గ్రామంలో విస్తృతంగా పరిశీలించింది. అనుమానితులను స్టేషన్‌కు పిలిచి హెచ్చరించారు. తవ్వకాలకు పాల్పడినా, బెదిరించినా కేసులు తప్పవని డీఎస్పీ స్పష్టం చేశారు.
తెలంగాణ
గణేష్‌పూర్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీ


