JGL: ధర్మపురి మండలం నేరెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిన్న ప్రసవ పూర్వ సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. వైద్యాధికారి డా.శివకుమారి ఆధ్వర్యంలో గర్భిణులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు. గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రిలోనే సురక్షిత డెలివరీ చేయించుకోవాలని సూచించారు. ప్రతిరోజూ యోగా చేయాలని, తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తప్పక తీసుకోవాలన్నారు.
తెలంగాణ
ఆరోగ్య కేంద్రంలో ప్రసవపూర్వ సంరక్షణ కార్యక్రమం


