NGKL: వంగూరు మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించకపోవడంపై గ్రంథాలయ పాఠకులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం నిర్వహించాల్సిన గ్రంథాలయ వారోత్సవాలను ఈసారి అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. వారోత్సవాల ద్వారా ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించడంతో పాటు గ్రంథాలయాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించవచ్చన్నారు.
తెలంగాణ
గ్రంథాలయ వారోత్సవాలను మర్చిపోయిన అధికారులు


