హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: హైవే పక్కనే వ్యర్థాల పారబోత..!

SRPT: చింతలచెరువు ప్రాంతానికి చెందిన సెప్టిక్ ట్యాంకర్ నిర్వాహకులు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. చివ్వెంల దీవెన కాలేజీ సమీపంలోని సూర్యాపేట- ఖమ్మం హైవే పక్కనే వ్యర్థాలు వదులుతుండగా వాహనదారులు నిలదీయడంతో వారు వెళ్లిపోయారు. దుర్వాసనతో విద్యార్థులు, ప్రయాణికులకు వ్యాధుల ముప్పు పొంచి ఉందని, బాధ్యుల వాహనాలు సీజ్ చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు.