హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త సంఘాల ఏర్పాటులో టాప్..!

NLG: గ్రామీణ ప్రాంతాల్లో సహకార వ్యవస్థను విస్తరించేందుకు ప్రభుత్వం కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 240 కొత్త సంఘాలకు అనుమతి ఇవ్వగా, నల్లగొండ జిల్లాకు అత్యధికంగా 23 కేటాయించింది. జనవరిలో వీటిని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. 13 ఏళ్ల తర్వాత కొత్త సంఘాలు ఏర్పాటు కానుండటంతో రైతులకు అవకాశం లభించనుంది.