హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోతోంది: కిషన్ రెడ్డి

హైదరాబాద్‌‌లో డ్రగ్స్ చలామణి విపరీతంగా పెరుగుతోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి నిగమాగమంలో నిర్వహించిన డ్రగ్ ఫ్రీ ఇండియా సదస్సులో ఆయన మాట్లాడుతూ.. మూతపడిన కంపెనీల్లో డ్రగ్స్ తయారీ, భవనాల టెర్రస్‌ లపై గంజాయి సాగు జరుగుతోందని పేర్కొన్నారు. యువతను మత్తు పదార్థాల నుంచి కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.