హైదరాబాద్: 28°C
తెలంగాణ

భైంసాలో మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

NRML: జిల్లా భైంసాలో ఓ మహిళను కత్తితో పొడిచి హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. భార్య ఫాతిమాపై అనుమానంతో, గొడవల కారణంగానే మహారాష్ట్రలోని బోకర్‌కు చెందిన మొహమ్మద్ షాహిద్ అలియాస్ జై భీమ్ ఆమెను హత్య చేశాడని ఏఎస్పీ సాయి కిరణ్ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కత్తి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.