హైదరాబాద్: 28°C
తెలంగాణ

విషాదం.. మనస్తాపానికి గురై మహిళ ఆత్మహత్య

SRD : గుమ్మడిదలలో స్వయం సహాయక సంఘం రుణం చెల్లించాలంటూ సభ్యులు అడగడంతో మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుంది. దోమడుగు గ్రామానికి చెందిన చెవిటి యాదగిరి భార్య నవనీత (32) సంఘం నుంచి రూ.లక్ష రుణం తీసుకుంది. సంఘం సభ్యులు ఇంటికి వెళ్లి డబ్బులు చెల్లించాలని కోరడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.