రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కోటా-ఉదయ్‌పూర్ హైవేపై 16 మంది భక్తులతో వెళ్తున్న వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతిచెందారు. వీరంతా ఖాటు శ్యామ్ ఆలయ దర్శనం ముగించుకుని మహారాష్ట్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది.
వార్తలు
ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో 9 మంది మృతి


