హైదరాబాద్: 28°C
వార్తలు

బ్రిటీష్ విద్యపై మోదీ విమర్శలు

భారత్‌పై అసూయతో దండెత్తినవారు మన కళలను దెబ్బతీసి, నిపుణుల బొటనవేళ్లు నరికేశారని ప్రధాని మోదీ అన్నారు. బ్రిటీష్ వారు గుమస్తాలను తయారుచేసే విద్యను మన దేశంలోకి తెచ్చారన్నారు. కోటు, టై సర్టిఫికెట్ల కంటే స్కిల్‌కే విలువ పెరిగిందని, ఐటీఐ వారికి ఐఐటీ స్థాయి గౌరవం దక్కాలన్నారు. ప్రపంచ నైపుణ్య రాజధానిగా భారత్ ఎదుగుతోందని, 2027లో గ్రేటర్ నొయిడాలో(యూపీ) ప్రపంచ నైపుణ్య పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.