SRCL: వేములవాడ పట్టణ కేంద్రం ఆదివారం ఉదయం దట్టమైన పొగమంచుతో కమ్ముకుంది. తెల్లవారుజాము నుంచి పట్టణంలోని ప్రధాన రహదారులు, వీధులు పొగమంచుతో నిండిపోవడంతో పరిసర ప్రాంతాలు మసకబారాయి. చలిగాలుల ప్రభావంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. ఉదయం వేళ వాహనదారులు లైట్లు వేసుకొని నెమ్మదిగా ప్రయాణించారు.
తెలంగాణ
పొగమంచుతో కమ్ముకున్న వేములవాడ పట్టణం


