SRD: జహీరాబాద్ ప్రాంతంలో సాగుతున్న అక్రమ ఎర్రరాయి విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో డీఎస్పీ సైదానాయక్ ఆధ్వర్యంలో జహీరాబాద్, చిరాగ్పల్లి పోలీసులు శనివారం మెరుపు దాడులు నిర్వహించారు. బాగారెడ్డిపల్లి ఫ్లైఓవర్ సమీపంలో 4 ట్రాక్టర్లు, 2 లారీలను, ఉప్పర్పల్లి తండా వద్ద రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
తెలంగాణ
ఆరు వాహనాలు స్వాధీనం కేసు నమోదు


