హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు గాలిపల్లి విద్యార్థిని ఎంపిక

SRCL: ఇల్లంతకుంట మండలంలోని గాలిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వల్లె రిషిత అండర్-14 విభాగంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 20న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది.