హైదరాబాద్: 28°C
క్రీడలు

పంత్ సెంచరీ.. భారత్ స్కోర్ ఎంతంటే?

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 4వ రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 629/6 పరుగులు చేసింది. సెంచరీతో చెలరేగిన రిషభ్ పంత్ (128) లంచ్ బ్రేక్ ముందు ఔటయ్యాడు. అన్షుల్ కాంబోజ్ 38 పరుగులతో రాణించాడు. ప్రస్తుతం ధ్రువ్ జురెల్ (32) క్రీజులో ఉన్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 261 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. కాగా, న్యూజిలాండ్‌పై భారత్‌కు టెస్టుల్లో ఇదే అత్యధిక స్కోరు.