హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు భారత్‌కు నేపాల్ ప్రధాని 

నేపాల్ ప్రధాని బాలేంద్ర షా రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ భారత్‌కు రానున్నారు. మార్చిలో ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే ఆయన తొలి విదేశీ పర్యటన. ఇవాళ సాయంత్రం విదేశాంగ మంత్రి జైశంకర్ ఆయనతో భేటీ అవుతారు. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు జరిపి కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. అనంతరం రాష్ట్రపతి ముర్మును కూడా బాలేంద్ర కలవనున్నారు.