హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత

MDK: జిల్లాలో ఆదివారం చలి తీవ్రత మరింత పెరిగింది. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సంఘం వాతావరణ కేంద్రాల గణాంకాల ప్రకారం శంకరంపేటలో అత్యల్పంగా 15.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15.5 నుంచి 18.9 డిగ్రీల మధ్య, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.1 నుంచి 31.5 డిగ్రీల వరకు ఉన్నాయి. జిల్లాలో వర్షపాతం సున్నాగా నమోదైంది.