హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నంలో తొలిరోజు 46 నామినేషన్లు

కృష్ణా: మచిలీపట్నం సౌత్ మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు ఉత్సాహంగా సాగింది. తొలిరోజు మొత్తం 46 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సర్పంచ్ పదవులకు 11, వార్డు సభ్యుల పదవులకు 35 నామినేషన్లు అందాయి. ఎస్.ఎన్. గొల్లపాలెం, రుద్రవరం గ్రామాల్లో మూడేసి, సీతారామపురంలో ఒకటి, గుండుపాలెం, గారాలదిబ్బ గ్రామాల్లో రెండేసి నామినేషన్లు నమోదయ్యాయి.