హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రతి చిన్నారికి పూర్తి టీకాలు వేయించాలి: DMHO

కడపలోని సున్నపుబట్టీల-1 అంగన్‌వాడీ కేంద్రంలో టీకాల కార్యక్రమాన్ని DMHO డాక్టర్ యుగంధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు షెడ్యూల్ ప్రకారం అన్ని టీకాలు వేయించాలని తల్లులకు సూచించారు. టీకాల నమోదును ఆర్‌సీహెచ్, యూ-విన్ పోర్టళ్లలో అప్‌లోడ్ చేయాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.