హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రీడాకారులకు సీఐ ఘన సత్కారం

విజయనగరం రోటరీ క్లబ్ సెంట్రల్ వీక్లీ సమావేశంలో జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపికైన తొమ్మిది మంది బాలబాలికలను రెండవ పట్టణ సీఐ టి. శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు, కోచ్‌లకు జ్ఞాపికలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులలో క్రమశిక్షణ, పట్టుదల ప్రాముఖ్యతను వివరిస్తూ వారిని ఉత్సాహపరిచారు.