AKP: నాతవరం మండలం ములగపూడి గ్రామంలో పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించి గ్రామస్థులకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు వార్తలు, వివాదాస్పద పోస్టులు ప్రచారం చేయవద్దని సీఐ ఎల్. రేవతమ్మ సూచించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ములగపూడిలో పల్లెనిద్ర కార్యక్రమం


