హైదరాబాద్: 28°C
వార్తలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త

శబరిమల అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. భక్తులు తమ పవిత్ర ఇరుముడిని విమాన క్యాబిన్‌లోకి నేరుగా తీసుకెళ్లేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ వరుసగా మూడో ఏడాది కూడా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా వెల్లడించారు. భక్తుల ఆచారాలను గౌరవిస్తూ, ఇరుముడిని తమ వెంటే ఉంచుకుని ప్రయాణించేలా నిబంధనలు సడలించినట్లు తెలిపారు.