PPM: బాలికల ఆరోగ్య వికాసానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ టి. జగన్ మోహన్ రావు అన్నారు. ఈ మేరకు పార్వతీపురంలోని జూనియర్ కళాశాలలో కిశోర బాలికల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 నుంచి 19 ఏళ్ల వయస్సు కిశోర దశ అని, ఈ సమయంలో బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి'


