హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హనుమంతునిపాడు సర్పంచ్‌గా గంటా అంజమ్మ ఏకగ్రీవం

ప్రకాశం: హనుమంతునిపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గంటా అంజమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి చేతుల మీదుగా ఎన్నికైనట్లు డిక్లరేషన్ ఫారాలను అందుకున్నారు. అలాగే గ్రామ పంచాయతీలోని 10 మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికై, డిక్లరేషన్ ఫారాలను అందుకున్నారు. అంజమ్మ ఏకగ్రీవం కావడంతో మండల కేంద్రంలో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు.