హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళాశాలలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమం

కోనసీమ: రామచంద్రపురం జి.ఆర్.సి. మోడరన్ జూనియర్ కళాశాలలో శనివారం ప్రముఖ విద్యావేత్త, జేఎన్టీయూ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె.వి.ఎస్.జి. మురళీకృష్ణ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అందించారు. పట్టుదల, సమయపాలన, మాతృభాషపై అభిమానం, ఇతర భాషల్లో నైపుణ్యం విజయానికి కీలకమని సూచించారు. సమాజ హితం, పర్యావరణ పరిరక్షణ, దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.