SS: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గోరంట్ల మండలంలోని పంచాయతీలలో సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర మంత్రి సవిత సమీక్షించారు. పెనుకొండలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం మండల నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీల వారీగా అభ్యర్థుల ఎంపిక అంశంపై నాయకులతో చర్చించినట్లు మంత్రి సవిత పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై మంత్రి సమీక్ష


