హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

24న రాధాకృష్ణ మహోత్సవం

VSP: భీమిలి గోకుల్ పార్క్‌లో ఈ నెల 24న రాధాకృష్ణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అక్కరమాని వెంకటరావు శనివారం తెలిపారు. ఉదయం 8.30 గంటలకు పూజలు, సాయంత్రం ప్రత్యేక దర్శనం, సాంస్కృతిక కార్యక్రమాలు, బాణసంచా ప్రదర్శనలు ఉంటాయన్నారు. భక్తులకు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.