హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐదేళ్ల నిర్లక్ష్యంపై వైసీపీని నిలదీయండి: మంత్రి

W.G: ఐదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయని వైసీపీ నేతలను ప్రజలు నిలదీయాలని మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. పాలకొల్లు 32, 41వ వార్డుల్లో శనివారం కూటమి ఛైర్‌పర్సన్ అభ్యర్థి ఉషారాణి, కౌన్సిలర్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించడం అవసరమని ఆయన స్పష్టం చేశారు.