SKLM జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై నిరంతర నిఘా ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశా ఖాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి. నరేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం (పీసీపీఎన్‌డీటీ) అమలును పకడ్బందీగా పర్యవేక్షించాలని సూచించారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'స్కానింగ్ కేంద్రాలపై నిరంతర నిఘా ఉంచాలి'


