BDK: భద్రాచలం జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో టూ బీట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను డీఎస్పీ అరుణ్ కుమార్, సీఐ సట్ల రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలు, ఆన్లైన్ గేమ్స్‌కు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలతో ఆరోగ్యం, క్రమశిక్షణ, పట్టుదల, ఐకమత్యం పెరుగుతాయని తెలిపారు.
తెలంగాణ
VIDEO: క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి: డీఎస్పీ


