హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దిరశవంచలో పెట్రోల్ బాటిళ్లతో నిరసన!

KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని దిరశవంచ, నేలటూరు, నాగిశెట్టిపల్లె పంచాయతీల నామినేషన్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. దిరశవంచలో YCP అభ్యర్థిని ప్రత్యర్థులు అడ్డుకున్నారని ఆ పార్టీ వర్గీయులు ఆరోపించారు. ఈ క్రమంలో మహిళల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. CI తమపై చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ ఇద్దరు పెట్రోల్ బాటిళ్లతో నిరసనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.