హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కౌంటింగ్ కేంద్రాల భద్రతను పరిశీలించిన ఎస్పీ

ప్రకాశం: కందుకూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు శనివారం పట్టణంలోని స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం, పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. 40 వార్డులకు 65 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నెల 26న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లకు మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.