హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూముల రీ సర్వే పరిశీలన

ASR: పెదబయలు, ముంచింగిపుట్టు మండలాల్లో భూముల రీ సర్వే ప్రక్రియను రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్, భూ రికార్డుల డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ శనివారం పరిశీలించారు. పెదబయలు మండలం అల్లంగిపుట్టు, ముంచింగిపుట్టు మండలం రాములు గ్రామాల్లో సర్వే పనుల పురోగతిని సమీక్షించారు. రైతులతో మాట్లాడి భూముల సరిహద్దులు, విస్తీర్ణం, రికార్డుల నమోదుపై వారి సందేహాలను నివృత్తి చేశారు.