ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలోని నూజివీడు రైల్వే గూడ్స్ యార్డులో గుర్తుతెలియని రైలు ఢీకొని సుమారు 45-50 ఏళ్ల వ్యక్తి శనివారం మృతి చెందాడు. ప్రమాద తీవ్రతకు తల పగిలి, మెడ తెగిపోవడంతో పాటు చేతులు, కాళ్లు ముక్కలయ్యాయి. మృతుడి ఒంటిపై సిమెంట్ రంగు ప్యాంటు, నల్లటి చొక్కా ఉన్నాయి. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏలూరు ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
మెడ తెగి.. ఛిద్రమైన శరీరం..!


