హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నం డీ మార్ట్‌లో అధికారుల తనిఖీలు

కృష్ణా: మచిలీపట్నం డీ మార్ట్‌లో వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ అందిన ఫిర్యాదుల మేరకు జిల్లా పౌర సరఫరాల అధికారి శివప్రసాద్ శనివారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ వస్తువుల ధరలు, వాటిపై ముద్రించిన గరిష్ఠ చిల్లర ధర విక్రయ ధరలను పరిశీలించారు. వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.