హైదరాబాద్: 28°C
వార్తలు

నీతీష్ సేతును ప్రారంభించిన మోదీ

బీహార్‌లో గంగా నదిపై నిర్మించిన 9.76 కి.మీ పొడవైన 6 లేన్ల 'నీతీష్ సేతు' వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. వైశాలి జిల్లాలోని బిదుపూర్ బ్లాక్‌ను, పట్నా శివార్లలోని కచ్చి దర్గాతో ఈ వంతెన కలుపుతుంది. బీహార్ మాజీ సీఎం నీతీష్ కుమార్ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరగడంతో ఆయన పేరు పెట్టారు. అంతకుముందు, పట్నా విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి నీతీష్ ఘన స్వాగతం పలికారు.