హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు పనులతో ప్రయాణికులకు తిప్పలు

MDCL: వరంగల్ జాతీయ రహదారిపై ఘట్‌కేసర్ ప్రధాన కూడలి వద్ద శనివారం వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. డివైడర్లకు రంగులు వేసే పనులు చేపట్టడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్, వరంగల్ మార్గాల్లో వాహనాలు బారులు తీరాయి. ముందస్తు ట్రాఫిక్ మళ్లింపులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు.