హైదరాబాద్: 28°C
తెలంగాణ

మురుగు కాల్వ దుర్వాసనతో ఇబ్బందులు

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని CSI చర్చి సమీపంలో మెయిన్ రోడ్ పక్కన మురుగు కాల్వ చెత్తాచెదారంతో నిండిపోయింది. మురుగు కాల్వలో చెత్త పేరుకుపోవడంతో నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, స్థానికులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.