హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటిగ్రేటెడ్ భవనంలో భారీ చోరీ

MDK: చేర్యాలలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్‌లో గుర్తుతెలియని వ్యక్తులు సుమారు రూ.5 లక్షల విలువైన కరెంట్ వైర్లను అపహరించారు. గదుల తాళాలు పగులగొట్టి శుక్రవారం రాత్రి చోరీకి పాల్పడినట్లు సమాచారం. సూపర్‌వైజర్ ధర్మరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరేళ్లుగా అసంపూర్తిగా ఉన్న భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.