హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

MDK: నిజాంపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ శనివారం వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, క్రైమ్ రిజిస్టర్లు, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణ, డ్యూటీ క్రమశిక్షణను సమీక్షించారు. స్టేషన్ నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.