హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీమా నమోదులో జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

JN: అర్హత గల ప్రతి కుటుంబం రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో నమోదు చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. శనివారం జనగామ మండలం నిడిగొండ గ్రామంలో నమోదు కేంద్రాన్ని పరిశీలించి ఆయన మాట్లాడారు. దరఖాస్తుల్లో ఆధార్, ఫోన్ నంబర్ వివరాలు తప్పులు లేకుండా నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. 18–59 ఏళ్ల వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.