RR: కడ్తాల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మైసిగండి మైసమ్మ తల్లి జాతర ఈ నెల 4 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వీరేశం తెలిపారు. జాతరను వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
తెలంగాణ
ఈ నెల 4 నుంచి మైసమ్మ జాతర


