హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ జీవిత బీమా అవగాహన సదస్సు

BHPL: గోరికొత్తపల్లి మండలం చెన్నాపూర్, దామరించపల్లి, చిన్నకోడపాక, బాలయ్యపల్లి గ్రామాల్లో శనివారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులందరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.