హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ కట్టడాలపై అధికారుల ఉక్కుపాదం

NZB: జిల్లా నందిపేట మండలం లోని పడిగల చెరువు బఫర్ జోన్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు శనివారం జేసీబీలతో కూల్చివేశారు. ట్రైనీ కలెక్టర్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సురేష్ పామూరి ఆధ్వర్యంలో రేకుల షెడ్లు, భవన నిర్మాణాలను తొలగించారు. బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.