హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థుల తరపున మంత్రి ప్రచారం

బాపట్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 36వ వార్డులో మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మరాజు, కూటమి చైర్మన్ అభ్యర్థి ఇస్కా సునీల్ కుమార్ ప్రచారం నిర్వహించారు. కౌన్సిలర్ అభ్యర్థులు, కూటమి నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.