NZB: నవీపేటలో బాసర ప్రధాన రహదారిపై శనివారం బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. ప్రధాన రహదారిపై ఉన్న రైల్వేగేటును బలంగా ఢీకొనడంతో గేటు విరిగిపోయింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
బొలెరో బీభత్సం.. రైల్వే గేటు ధ్వంసం


