హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 23న తాండూర్‌లో మహా రుద్రాభిషేకం

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గోషాలలో ఈనెల 23న మహా రుద్రాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గోశాల సేవా సమితి సభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇట్టి రుద్రాభిషేకాన్ని పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శంకర్ యాదవ్ దంపతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక గురువులు పరిపూర్ణానంద స్వామి విచ్చేస్తున్నట్లు తెలిపారు.