కృష్ణా: కీర పండరీపురంగా ప్రసిద్ధిగాంచిన మచిలీపట్నం చిలకలపూడి పాండురంగ స్వామి ఆలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథం పురవీధుల్లో సాగగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పాండురంగ స్వామి రథోత్సవం


