హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు కార్పొరేషన్‌లో ట్విస్ట్!

చిత్తూరు నగరంలోని 7వ డివిజన్ కార్పొరేటర్ హరిణి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని నగర కమిషనర్ పి.నరసింహ ప్రసాద్‌కు అందజేశారు. పదవిలో ఉన్నా లేకున్నా జగన్, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, చిత్తూరు ఇన్‌ఛార్జ్ విజయానందరెడ్డి ఆదేశాలకు కట్టుబడి ఉంటానన్నారు. ప్రజల రుణం తీర్చుకుంటానని, ప్రజాసేవలోనే ఉంటానన్నారు.